Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా పార్టీ పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారని కానీ.. పవన్ కల్యాణ్ మాత్రం గత 15 ఏళ్లుగానే కాదు.. ఇంకో 15 ఏళ్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర పాలేరుగా ఉంటానంటున్నాడని విమర్శించారు. అప్పుడు అన్న చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాడని గుర్తుచేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ తన పార్టీని బీజేపీలో లేదా చంద్రబాబుతో విలీనం అవుతాడో తెలియదని ఎద్దేవా చేశారు. ఏ పార్టీలో విలీనం అవుతాడో తెలియదు కానీ విలీనం మాత్రం పక్కా అని చెప్పారు.
మూడు రోజుల క్రితం అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని గోడి గ్రామంలో వైసీపీ నిర్వహించిన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ వ్యాఖ్యలు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఇజ్రాయిల్‌పై జనసేన పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నేరుగా ఇజ్రాయిల్‌కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. పాలేరుతనం ఏంటని ఆయనపై మండిపడ్డారు. దయచేసి నోరు జారవద్దని సూచించారు.
పవన్ కల్యాణ్ స్థాయి ఏంటో ఒకసారి ఆలోచించండి.. ఆయన్ను ఆ విధంగా మాట్లాడటానికి మన స్థాయి ఏంటని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అడిగారు. ప్రధాని అందర్నీ విడిచిపెట్టి పవన్ కల్యాణ్‌ను పిలుస్తారు.. ఈ రాష్ట్రానికి నిధులు కూడా ఆయన పేరు చెబితేనే ఇస్తున్నారు..అలాంటి వ్యక్తిని నువ్వు విమర్శించేది ఏంటని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న నీతి నిజాయితీ గల పవన్ కల్యాణ్‌ను నువ్వు గానీ, వైసీపీ నాయకులుగానీ విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలిన వైస్సార్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కి ఫోన్ చేసి లైవ్ లో గడ్డి పెట్టిన పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ 🔥🔥
దేశ ప్రధానమంత్రి మోడీచే ప్రశంసలు అందుకున్న పవన్ కళ్యాణ్ నా నీవు విమర్శించేది అంటూ కోటింగ్. ఈ రాష్ట్రానికి నిధులు… pic.twitter.com/VeH40LU0vn
— Political Missile (@TeluguChegu) August 7, 2025
మళ్లీ కౌంటర్ ఇచ్చిన ఇజ్రాయిల్
గిడ్డి సత్యనారాయణతో పాటు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా సోషల్‌మీడియాలో బొమ్మి ఇజ్రాయిల్‌పై తీవ్రంగా స్పందిస్తున్నారు. వాళ్లందరికీ మళ్లీ ఇజ్రాయిల్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌ను అనేక అగ్ర నాయకులు విమర్శిస్తూనే ఉన్నారని.. వాళ్లందరిని తిట్టే ధైర్యం మీకుందా అని గిడ్డి సత్యనారాయణను ప్రశ్నించారు. మీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని తేల్చి చెప్పారు. ఇకపై కూడా పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.