అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో సాక్షులను బెదిరించిన కేసులో వైసీపీ( YCP ) ఎమ్మెల్సీ అనంతబాబు ( MLC Anantha Babu ) ను, అతని భార్య లక్ష్మీదుర్గను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనపై పోలీసులు గతంలోనే ఎమ్మెల్సీని అరెస్టు చేయగా దాదాపు 8 నెలలపాటు జైలులో ఉన్నారు.
అనంతరం బెయిల్‌పై విడుదలైన ఆయన డ్రైవర్ హత్య కేసులో సాక్షులుగా ఉన్న పలువురిని బెదిరించడం, డబ్బు ప్రలోభాలకు గురిచేయడంతో ఈనెల 20న ఎమ్మెల్సీపై కాకినాడలోని సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
అప్పటి నుంచి అదృశ్యమైన ఎమ్మెల్సీ అనంతబాబు, అతడి భార్య కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. అయితే హత్య కేసులో శుక్రవారం రాజ మహేంద్రవరం కోర్టుకు వచ్చిన దంపతులను సర్పవరం పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరించారు.