YCP Leaders | ఎన్నికల కమిషన్‌పై అనుమానాలు వ్యక్తం చేసిన వైసీపీ నాయకులు సజ్జల, అనిల్ కుమార్ యాదవ్
YCP Leaders | ఏపీలో ఎన్నికల రోజున జరిగిన విధ్వంసక ఘటనలపై ఎన్నికల కమిషన్(Election Commission) వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
అమరావతి : ఏపీలో ఎన్నికల రోజున జరిగిన విధ్వంసక ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. 13న పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసాలు జరిగితే, 21వ తేదీన వీడియో బయటకు ఎందుకు వచ్చిందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) , వైసీపీ నాయకుడు అనిల్‌కుమార్ యాదవ్ (Anil Kumar yadav) ప్రశ్నించారు. వేర్వేరుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
ఎన్నికల్లో 9 చోట్ల ఈవీఎం(EVM) లు పగలగొడితే, ఒక్క మాచర్ల ఎంఎల్ఏ రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం విజువల్స్ (Visuals) బయటికి ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. ఒక్క వీడియో బహిర్గతంపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. మిగతా వీడియోల సంగతిని ఎందుకు రిలీజ్ చేయలేదని, అందులో ఎవరెవరూ భాగస్వామ్యమయ్యారో తేల్చాలని డిమాండ్ చేశారు.
పల్నాడు ప్రాంతంలో మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలకు మూడు రోజులు ముందుగా క్షేత్రస్థాయిలో సిబ్బందిని మార్చేసి , ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఎక్కువగా నియమించారని ఆరోపించారు. దీంతో ఆ ప్రాంతంలో వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. టీడీపీ నాయకులు చేసిన దాడులపై ఫిర్యాదులు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ పారదర్శకంగా విచారణ జరిపించాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

