Pulivendula | పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం దిగజారి ప్రవర్తిస్తోందని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఓటర్ల ఇంటికి వెళ్తున్న టీడీపీ నేతలు.. ఓటర్ స్లిప్లు లాక్కుంటున్నారని.. ఇవ్వకపోతే ఓటర్లను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు వైసీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు.
అనంతరం పేర్ని నాని మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె, ఎర్రిపల్లి, నల్లగొండువారిపల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ స్లిప్పులను తీసుకుంటున్నారని తెలిపారు. ఓటుకు పది వేల రూపాయలు ఆశచూపిస్తున్నారని.. ఓటర్ స్లిప్పులు ఇవ్వకపోతే బెదిరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులపై దాడులు చేస్తాం.. కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు. రికార్డుల ప్రకారమే పోలీసులు ఉన్నప్పటికీ ఎవరినీ పట్టుకోవడం లేదని అన్నారు.
టీడీపీ అక్రమాల నేపథ్యంలో రేపు ఉదయంలోపు మళ్లీ ఓటరు స్లిప్పులను పంచాలని పేర్ని నాని కోరారు. కాల్ సెంటర్ పెట్టాలని.. స్లిప్పులు ఇవ్వమని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేపు ఒక్కరోజైనా ఎన్నికల కమిషన్ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
ఒంటిమిట్టలో ఓటర్ స్లిప్స్ తీసుకుంటున్న టీడీపీ కార్యకర్తలు
ధవంతంపల్లిలోని ఎస్సీ కాలనీలో బెదిరించి ఓటర్ స్లిప్ లు తీసుకున్న టీడీపీ కార్యకర్తలు. ఎందుకు ఇలా అని ప్రశ్నిస్తుంటే.. పోలింగ్ బూత్ నెంబర్ తేడా పడిందంటూ బుకాయింపు
గ్రామమంతా వదిలేసి తమ దగ్గరే ఎందుకు ఇలా… pic.twitter.com/OJ2UePRENk
— YSR Congress Party (@YSRCParty) August 11, 2025