Perni Nani | కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. షిప్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిన అధికారులు కస్టమ్స్, పోర్టు అధికారులు ఇద్దరూ తనతో బోటులో ఉండగా.. తనకు అనుమతి ఇవ్వలేదని పవన్ కల్యాణ్ చెప్పడమేంటని అనుమానం వ్యక్తం చేశారు. అంటే సీఎం చంద్రబాబు అనుమతులు ఇవ్వలేదా? లేదంటే పవన్ కల్యాణే అబద్ధాలు ఆడుతున్నారా అని ప్రశ్నించారు.
కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనిఖీలు ఓ మంచి ప్రయత్నమని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాలని అన్నారు. ప్రాణాలకు తెగించి పవన్ కల్యాణ్ చేసిన ఈ సాహసంపై పలు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. తనను షిప్ ఎక్కేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదని పవన్ కల్యాణ్ చెప్పారని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ వెళ్లిన బోటులోనే కస్టమ్స్, పోర్టు అధికారి ఇద్దరూ ఉన్నారని తెలిపారు. అనుమతి ఇవ్వాల్సిన ఇద్దరు అధికారులు ఆయనతోనే ఉంటే.. అనుమతి ఇవ్వడం లేదని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అంటే పవన్ కల్యాణ్ షిప్ ఎక్కవద్దని సీఎం చంద్రబాబు చెప్పి ఉండాలి.. లేదంటే పవన్ కల్యాణే అబద్ధం చెప్పి ఉండాలని అన్నారు.
స్టెల్లా షిప్ చేయమని పవన్ కల్యాణ్ చెప్పారని.. అక్కడే ఉన్న కెన్‌స్టార్ అనే మరో షిప్‌ను సీజ్ చేయమని పవన్ ఎందుకు చెప్పాలేదని పేర్ని నాని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు శ్రీను అందులో బియ్యం తరలిస్తున్నారని తమకు సమాచారం ఉందని అన్నారు. బియ్యం రవాణా విషయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ డ్రామా ఆడుతున్నారా? ప్రశ్నించారు.