Borugadda Anil | వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ను అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులతో పాటు జడ్జిలను కించపరిచే విధంగా మాట్లాడిన కేసులో అరెస్టయిన ఆయన్ను మూడు రోజుల కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతపురం జిల్లాకు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో ఫోర్త్ టౌన్ పోలీసులు తీసుకెళ్లారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులతో పాటు జడ్జిలను కించపరిచేలా బోరుగడ్డ అనిల్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిపై తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు బోరుగడ్డ అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే ఆయన్ను విచారించేందుకు మూడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి తెలిపింది.