అమరావతి : ఏపీలోని అన్నమయ్య(Annamaiah) జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై (MPDO Jawahar Babu) వైసీపీ నాయకుడు ఒకరు దాడి చేసి గాయపరిచాడు. గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్‌రెడ్డి శుక్రవారం ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని ఎంపీడీవోను కోరాడు. ఎంపీపీ లేకుండా గది తాళాలు ఇచ్చే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పడంతో ఒక్కసారిగా అనుచరులతో కలిసి ఎంపీడీవోపై దాడి చేసి గాయపరిచాడు. ఘటనపై ఎంపీడీవో పోలీసులకు ( Police Case) ఫిర్యాదు చేయడంతో పోలీసులు సుదర్శన్‌రెడ్డి అరెస్టు చేశారు. గాయపడిన ఎంపీడీవోను పోలీసులు రాయచోటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.