అమరావతి : ఏపీలో మూడు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో (Elections) పోలింగ్‌శాతం పెరుగుదలపై వైసీపీ (YCP) మరోసారి ఎన్నికల సంఘానికి(Election Commission) ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు(Ambadti Rambabu), మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు సీఈవోను కలిసి వినతిపత్రం అందజేశారు .
ఈ సందర్భంగా అంబటి మీడియా మాట్లాడుతూ వైసీపీ అనుమానాలు ఈసీ నివృత్తి చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తమకు ఎన్నికల ఫలితాలపై (Results) మొదటి నుంచి అనుమానం ఉందని, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే స్వచ్ఛంద సంస్థ కూడా తాజాగా అనుమానాలు చేసిందని గుర్తు చేశారు. ఈవీఎం యంత్రాల్లో ఎన్ని ఓట్లు పడ్డాయో వీవీ ప్యాట్(VV Pats) లో కూడా అంతే సంఖ్యను చూపించాల్సి ఉండగా ఏపీలో ఆ విధంగా జరుగలేదని ఆరోపించారు. \
పోలింగ్ గడువు ముగిసే సమయానికి 68.12 శాతం ఓటింగ్ జరుగగా క్యూ లైన్లో నిలబడి రాత్రి ఓటేసిన తరువాత మరోరకంగా , జూన్ 4న లెక్కింపు రోజున 82 శాతం పోలింగ్ జరిగిందని పేర్కొనడంపై తమకు అనుమానాలున్నాయని పేర్కొన్నారు. దాదాపు 12 శాతానికి పైగా తేడా ఉండటం అసాధారణమని, ఇదే విషయమై తాము పలుమార్లు ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ సరైన సమాధానం తెలియజేయకపోవడం అనుమానాలకు కారణమని వ్యాఖ్యనించారు.
ఫారం 20 లో పార్టీలవారీగా ఓట్లను ప్రకటించాల్సి ఉండగా నేటి వరకు ఓట్లను ప్రకటించాలేదని వెల్లడించారు. ఏయే అసెంబ్లీలో ఎంత శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఈసీ వెల్లడించడంలేదని దుయ్యబట్టారు.