అమరావతి : ఏపీ ఎన్నికల ఫలితాల రోజున వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లు( Counting Agents) మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వ సలహదారుడు, వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) సూచించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కుట్రలు, కుతంత్రాలతో అధికారంలోకి రావాలన్న టీడీపీ(TDP) ఆలోచనలకు భిన్నంగా వైసీపీ ఏజెంట్లు పనిచేయాలని కోరారు. ప్రత్యర్థులు చేసేది ధర్మయుద్ధం కాదని అన్నారు. ఒక్క ఓటు కూడా నష్టపోకుండా చూడాలని వెల్లడించారు. పోలింగ్ రోజు నుంచి ఈసీ(Election Commission) అన్యాయంగా ఎటు పోతుందో గమనిస్తున్నామని, పార్టీ శ్రేణులు ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లను గమనిస్తూ, వారి అక్రమాలను అడ్డుకోవాలని తెలిపారు. మళ్లీ జగనే అధికారంలోకి రానున్నారని, 9న ప్రమాణ స్వీకారం ఉంటుందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నారు.