Srisailam | శ్రీశైల జలాశయాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు క్షుణ్ణంగా పరిశీలించి ఆనకట్ట భద్రతకు చేపట్టవలసిన ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు చెప్పారు. మంగళవారం వైకే హండ, వినోద్ వర్మ ప్రత్యేక బృందంతోపాటు సీడబ్ల్యూసీ అధికారులు అతుల్ యాప, అఖిలేష్ కుమార్ తదితరులు శ్రీశైలం డ్యాం బాటమ్లెవల్ గ్యాలరీ నుండి డీ వాటరింగ్ విధానాన్ని పరిశీలించారు.
2009లో వరద ప్రభావంతో దెబ్బతిన్న కుడిగట్టు కొండ చరియలు, రహదారుల పునరుద్దరణ, యాప్రాన్, ఫ్లంజ్పూల్ బలోపేతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను గురించి బ్యాంకు ప్రతినిధులకు నీటి పారుదల శాఖ అధికారులు వివరించారు. అలాగే డ్యాం మరమ్మతులు చేపట్టాల్సి ఉందన్నారు. ఇందుకయ్యే వ్యయంలో 70 శాతం ప్రపంచ బ్యాంకు ద్వారా, మిగిలిన 30 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసేందుకు గతంలో ఒప్పందం కుదిరిందని ప్రపంచ బ్యాంక్ అధికారులకు తెలిపారు.