అమరావతి : మహిళలకు స్వేచ్చ. స్వతంత్రంతో పాటు రాజకీయ అవకాశాలు కల్పించాలని మాజీ ఉపరాష్ట్రపతి, పద్మవిభూషణ్ వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. అంతర్జాతీయ మహిళా దిన్సోత్సవం( International Womensday) సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల సాధికారత అవసరమని అన్నారు.
రాబోయే రోజుల్లో పురుషులతో సమానంగా మహిళలు రాణించవలసిన అవసరముందని పేర్కొన్నారు. మహిళా సాధికారత(Empowerment) సాధ్యం కావాలంటే సాంఘిక, ఆర్థిక, అధికార పంపిణీ జరగాలని ఆకాంక్షించారు. వారసత్వం అంటే పెద్దల ఆస్తిని పంచుకోవడం కాదని, పెద్దల జవసత్వాలను ఆదర్శంగా తీసుకొని సమాజం కోసం పనిచేయడం నిజమైన వారసత్వమని వెల్లడించారు.
‘ ఇంట్లో ఒక మహిళ చదువుకుంటే ఇంటిలోని సభ్యులందరూ చదువుకుంటారు. అదే పురుషుడు ఒక్కడే చదువుకుంటాడని ’ వివరించారు. మహిళలకు విద్య ఎంతో అవసరమని సూచించారు.