కలకలం..ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద మహిళా ఆత్మహత్యాయత్నం
ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం సృష్టించింది. విజయవాడలోని
అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం సృష్టించింది. విజయవాడలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద కాకినాడకు చెందిన అరుద్ర
అనే మహిళ చేతిపై బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. వీల్‌చైర్‌లో కదల్లేని స్థితిలో ఉన్న కుమార్తెను తీసుకొచ్చిన తల్లి ఆరుద్ర సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చింది. అక్కడ నిర్వహించే స్పందనలో సీఎంవో అధికారులను కలిసి వచ్చాక ఈ అఘాత్యానికి పాల్పడింది.
అచేతనంగా పడి ఉన్న మహిళను గమనించిన సీఎంవో పోలీసులు హుటాహుటినా అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు మాట్లాడుతూ తన కూతురు దివ్యాంగురాలి చికిత్స కోసం తమ భూమిని అమ్ముకోనియకుండా ఏపీ మంత్రి దాడిశెట్టి రాజ గన్‌మెన్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది.
ఈ విషయమై గతంలో కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సీఎం కార్యాలయం వరకు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. సీఎంను అధికారులు కలవనీయలేదని, తనకు న్యాయం జరగదనే బాధతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు ఆమె వెల్లడించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bird flu | బర్డ్‌ఫ్లూ నియంత్రణకు తొలి స్వదేశీ టీకా.. ఈ నెల 20న దేశానికి అంకితం..!
Suicide Attempt | షాకింగ్ వీడియో .. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకిన మహిళ
KTR | మీ మాటలు, మీరు చేసిన సాయమే నాకు స్ఫూర్తి.. కేటీఆర్‌తో చంద్రకాంత్ సాగర్.. వీడియో
Condolense | అచ్చా విద్యాసాగర్ మృతి పట్ల మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంతాపం
Army captain killed | నదిలో పడిన ఆర్మీ వాహనం.. ఆర్మీ కెప్టెన్ మృతి, ముగ్గురు సిబ్బందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

