అమరావతి : లంచాలకు అలవాటు పడ్డ అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల చేతులు తడపనిదే పనులు చేయకపోవడంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ అధికారులు సకాలంలో దాడులు నిర్వహిస్తు లంచగొండి ఉద్యోగులను రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంటున్నారు.
తాజాగా కోనసీమ జిల్లాలో పి.గన్నవరం మహిళా ఎంపీడీవో విజయలక్ష్మి ఏసీబీ వలలో చిక్కుకుంది . బాధితుడి నుంచి రూ. 40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడింది . ఎంపీ ల్యాడ్స్ మ్యాచింగ్ గ్రాంట్ విడుదలకు రూ. 50వేలు లంచం డిమాండ్ చేయగా ఈనెల 6న రాజులపాలెం ఉప సర్పంచ్ రూ. 10 వేలు అందజేశాడు. మిగతా రూ. 40 వేలు ఈరోజు ఎంపీడీవోకు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేశారు.