అమరావతి : అసెంబ్లీ సాక్షిగా తన తల్లి భువనేశ్వరిపై విమర్శలు చేసిన వైసీపీ నాయకులకు భవిష్యత్లో గట్టిగా బుద్ధి చెబుతానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. బుధవారం మంగళగిరి పట్టణంలో ఆయన పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తల్లిని విమర్శించడం బాధించిందని పేర్కొన్నారు. మీ ఇంట్లోని కుటుంబ సభ్యులపై కూడా ఇదే విధంగా మాట్లాడుతారా అని వైసీపీ నాయకులను ప్రశించారు. ఈ వ్యవహారంలో నాన్న(చంద్రబాబు) వదిలిపెట్టినా నేను వదలను అని వెల్లడించారు.
తమ కుటుంబాన్ని బయటకు లాగాలని వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆరోపించారు. రానున్న కాలంలో వైసీపీ నాయకులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. వరదలతో ఇబ్బందులు ఎదుర్కొన్న జనాలను పట్టించుకున్న నాథులే కరువయ్యారని దుయ్యబట్టారు.