అమరావతి : తన భర్త జాడ తెలియడం లేదని అత్తింటి ఎదుట ఓ మహిళ బైఠాయించి నిరసన తెలిపిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం దిగువగాండ్లపల్లెలో జరిగింది. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన మహమ్మద్ సనా రెండు సంవత్సరాల క్రితం ఈ సెట్లో శిక్షణలో ఉండగా చిత్తూరు జిల్లాకు చెందిన రమేశ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
ఇద్దరూ 2022 న జనవరి 4న మదనపల్లె మండలం లోని ఓ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఇది నచ్చని రమేశ్‌కుమార్ కుటుంబ సభ్యులు సనాకు ఇబ్బందులు కలిగించడం మొదలుపెట్టారు. బాధలను తట్టుకోలేక ఈ నూతన జంట కొన్ని రోజులకే అత్తింటి నుంచి బయటకు వచ్చి మరో ప్రాంతంలో కాపురం చేస్తున్నారు. అయితే తన భర్త మూడు రోజులుగా కనబడ డం లేదని అత్తింటి వారిని నిలదీయగా తమకేమీ తెలియదని బుకాయిస్తున్నారని ఆరోపిస్తూ అత్తింటి వద్ద సనా ఆందోళన ప్రారంభించింది.
రమేశ్‌కుమార్‌ను వదిలివేయాలని అత్తింటి వారితో పాటు వైసీపీ నాయకు లు తనను బెదిరించారని బాధితురాలు వాపోయింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె వివ రించింది. భర్తను అత్తింటి వారే ఎక్కడో ఉంచి అబద్దాలు చెబుతున్నారని, భర్త రమేశ్‌కుమార్‌ను తనకు అప్పగించి న్యాయం చేయాలని ఆమె పోలీసులను కోరింది.