AP Cabinet Ministers | అమరావతి : రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రమాణం చేస్తారని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏడు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
చంద్రబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ మంత్రుల ప్రతిపాదిత జాబితా అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇది ఒక అంచనా మాత్రమే అని రాసుకొచ్చారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా రఘురామకృష్ణం రాజు, డిప్యూటీ స్పీకర్గా బొలిశెట్టి శ్రీనివాస్ రావు(జనసేన) నియామకం కానున్నట్లు తెలుస్తోంది.
1. నారా చంద్రబాబు నాయుడు – ముఖ్యమంత్రి,
2. కొణిదల పవన్ కళ్యాణ్ (జనసేన ) – డిప్యూటీ సీఎం
3. కింజరపు అచ్చన్న నాయుడు
4. కూనా రవికుమార్
5. ఆర్వీబీకే రంగారావు (బేబీ నాయన)
6. గంటా శ్రీనివాసరావు
7. చింతకాయల అయ్యన్నపాత్రుడు
8. శ్రీమతి వంగలపూడి అనిత
9. కొణతాల రామకృష్ణ (జనసేన )
10. గోరంట్ల బుచ్చయ్య
11. కామినేని శ్రీనివాసరావు (బీజేపీ )
12. నిమ్మల రామానాయుడు
13. బోండా ఉమామహేశ్వరరావు
14. వెనిగండ్ల రాము
15. కొల్లు రవీంద్ర
16. కన్నా లక్ష్మీనారాయణ
17. నారా లోకేష్
18. నాదెండ్ల మనోహర్ (జనసేన )
19. ధూళిపాళ్ల నరేంద్ర
20. పొంగూరు నారాయణ
21. పరిటాల సునీత
22. పయ్యావుల కేశవ్