అమరావతి : ఏపీలో హాట్ టాపిక్‌గా నడుస్తున్న వైఎస్ జగన్(YS Jagan), షర్మిల ( Sharmila ) ఆస్తి తగాదాలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏం సంబంధముందని టీడీపీ సీనియర్ నాయకుడు పట్టాభిరామ్ (TDP leader Pattabhi) అన్నారు. అన్న, చెల్లెల మధ్య ఆస్తుల పంపకం సమయంలో చంద్రబాబు అక్కడా ఉన్నారా? అంటూ వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డి, కరుణాకర్ రెడ్డిని ప్రశ్నించారు.
జగన్ ఫ్యామిలీలో డ్రామా నడుస్తోందని ఆరోపించారు. వైఎస్ జగన్ కోర్టుకు వెళ్లి తల్లిని, చెల్లిని బజారున కీడ్చి వారే రచ్చ చేసుకున్నారని విమర్శించారు. కుటుంబ గొడవ నుంచి దృష్టి మళ్లించడానికి చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని , బాబుపై అడ్డగోలు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
తాడేపల్లి ఇంటికి ఊడిగం చేసే ముఠాగా సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మగా ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.