
అమరావతి : వరద ప్రభావం వల్ల నష్టపోయిన బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఏపీ సీఎం జగన్ హామి ఇచ్చారు. గురువారం వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట పులపత్తూరు వరద ప్రాంతాల్లో పర్యటించారు. తన రెండురోజుల పర్యటనలో భాగంగా గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలు దేరిన సీఎం కడప జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం పులపత్తూరు గ్రామ వరద ప్రభావ ప్రాంతాల్లో కాలినడకను పర్యటించి బాధితులను, రైతులను పరామర్శించారు. వర్షం వల్ల ఎదురైన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కూలిన ఇండ్లను పరిశీలించారు. అనంతరం వరద నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు. కడప పర్యటన అనంతరం సాయంత్రం చిత్తూరు జిల్లాకు వెళ్లనున్నారు సీఎం జగన్.
రేపు (శుక్రవారం) చిత్తూరు,నెల్లూరు జిల్లాలో పర్యటించి వరద బాధితులను పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రభావిత జిల్లాలో అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి బాధితులను ఆదుకోవడంపై చేపట్టవలిసిన చర్యలను ఆయన వివరించారు.