అమరావతి : కర్ణాటకలో (Karnataka) జరిగిన రోడ్డు ప్రమాదంలో ( Raod Accident ) మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ( Vedic students ) మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. హంపీకి వెళ్తూ పొరుగు రాష్ట్రంలో ప్రమాదానికి గురైన వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఎంతో భవిష్యత్తు ఉన్న వేద విద్యార్థుల అకాల మరణంతో తీవ్ర శోకంలో ఉన్న వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని ట్విటర్లో (Twitter) పేర్కొన్నారు. కర్ణాటక రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసుల మృతి పట్ల మంత్రి రాంప్రసాద్‌రెడ్డి (Minister Ramprasad reddy) విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కర్ణాటక జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బుధవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన విద్యార్థులతో పాటు నలుగురు దుర్మరణం చెందారు. మృతులను మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన వారిగా గుర్తించారు. విద్యార్థులు వాహనంలో కర్ణాటక హంపీ క్షేత్రంలోని నరహరి తీర్థుల ఆరాధన కోసం తుఫాను వాహనంలో బయలుదేరి వెళ్లారు.
మంత్రాలయం నుంచి మంగళవారం రాత్రి బయలుదేరి వెళ్లగా.. ఉత్తరకన్న జిల్లాలో సింధనూరు వద్ద ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 14 మంది విద్యార్థులు ఉన్నారు. ఘటనలో వాహనం డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు విద్యార్థులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో డ్రైవర్ శివ, విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్ర, ఉన్నారు.