అమరావతి : అమెరికాలోని టెక్సాస్ నగరం డాలస్ సూపర్ మార్కెట్లో దుండగుడి కాల్పుల్లో బాపట్ల వాసి దాసరి గోపికృష్ణ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని భారత్కు తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ‘ఎక్స్’ లో వెల్లడించారు . బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Deeply saddened to learn that a young Dasari Gopikrishna from Bapatla has succumbed to injuries sustained in a shooting incident in Texas, USA. I offer my heartfelt condolences to his family and assure them that the GoAP will extend every possible support to help bring him home.…
— N Chandrababu Naidu (@ncbn) June 23, 2024
ఏపీలోని బాపట్ల(Bapatla) జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణ 8 నెలల క్రితం ఉద్యోగాన్వేషణ కోసం అమెరికా వెళ్లాడు. సౌత్ ఆర్కెన్సాస్లోని ఫోర్డీస్లో ఉంటూ అక్కడే మ్యాచ్ బుచర్ గ్రాసరీ స్టోర్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు.
శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్లో ఉండగా ఓ దుండగుడు సూపర్ మార్కెట్లోకి ప్రవేశించి అతడిపై కాల్పులు జరుపడంతో ఆయన నేలకొరిగాడు. తీవ్రంగా గాయపడ్డ గోపీకృష్ణను స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.