అమరావతి : గోదావరి ( Godavari Water )లో ప్రతి సంవత్సరం 3 వేల టీఎంసీల వరద నీరు వృధాగా వెళుతుందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ( Minister Nimmala Ramanaidu ) తెలిపారు. గోదావరి మిగులు జలాలను వినియోగించుకోవడంలో రెండు రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఈ నది జలాల సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని వెల్లడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమై పలు ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల సారాంశాన్ని మంత్రి నిమ్మల వివరించారు.తెలుగు రాష్ట్రాలు రెండు బాగుండాలని చంద్రబాబు మొదటినుంచి చెప్తున్నారని పేర్కొన్నారు. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తవుతుందని, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి సి ఆర్ పాటిల్ పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టు పోలవరంపీపీఏ, సీడబ్ల్యుసీ నిర్దేశించిన సమయం 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు .వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేశారని ఆరోపించారు.గోదావరి కావేరి అనుసంధానంపై కేంద్రమంత్రితో చర్చిచామని,పోలవరం సివిల్ వర్క్స్ ,ఆర్ అండ్ ఆర్ అంశాలను కేంద్రమంత్రికి వివరించామని వెల్లడించారు. తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్రమంత్రిని కోరినట్లు తెలిపారు.