అమరావతి : రాష్ట్రంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఏపీ హోంమంత్రి వనిత తెలిపారు. మొన్న రాత్రి రేపల్లె రైల్వేస్టేషన్లో మహిళపై జరిగిన అత్యాచార ఘటనను ఖండించారు. మద్యం మత్తులోనే రేపల్లె నిందితులు అత్యాచారం చేశారని స్పష్టం చేశారు. బాధితురాలి భర్త వద్ద దొంగతనానికి నిందితులు యత్నించడంతో చోరీని అడ్డుకున్న మహిళపై అఘాయిత్యం చేశారని వివరించారు.
మహిళల భద్రత దృష్ట్యా రైల్వేస్టేషన్లో భద్రత పెంచుతామని అన్నారు. రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరత వాస్తవమేనని అంగీకరించారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని, ‘ గడప గడపకు వైఎస్ఆర్’ వాయిదాలో రాజకీయ కోణం లేదని ఆమె తెలిపారు.