అమరావతి : రేపటి నుంచి ప్రారంభం కానున్న శీతాకాల పార్లమెంట్ ( Parliament ) సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక హామీలపై చర్చిస్తామని టీడీపీ పార్లమెంటరీ నేత, ఎంపీ లావు కృష్ణదేవరాయాలు (Lau Krishnadevarayalu) వెల్లడించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన జాయింట్ పార్లమెంట్ కమిటీ (Joint Parliamentary Committee) సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సమావేశం అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ఏపీ విభజన చట్టం (Bifurcation Act) హామీ మేరకు ఏపీకి కొన్ని సౌకర్యాలు లభించాయని, పెండింగ్‌లో ఉన్న వాటి కోసం పార్లమెంట్లో లేవనెత్తుతామని పేర్కొన్నారు. పది సంవత్సరాలు పూర్తికాని పోలవరం( Polavaram) ప్రాజెక్టుపై కూడా చర్చిస్తామని తెలిపారు.
5 సంవత్సరాల వైసీపీ(YCP) పాలనలో పోలవరానికి జరిగిన నష్టాన్ని సైతం వివరిస్తూనే ప్రాజెక్టు పూర్తికి కేంద్ర సహాయంపై చర్చిస్తామన్నారు. నదుల అనసంధానం వల్ల కలిగే లాభాల గురించి వివరిస్తూనే గోదావరి-పెన్నా అనుసంధానంపై చర్చ పెట్టాలని కోరుతామని వివరించారు. సహజ ఇంధన వనరుల కేటాయింపులు, కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తుత స్థితిలో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తామని పేర్కొన్నారు.
ఇటీవల విజయవాడలో వచ్చిన వరదలు, విపత్తు నిర్వహణ నిధిపై చర్చ జరగాలని కోరుతామని తెలిపారు. కౌలు రౌతులు, గల్ఫ్ బాధితుల సమస్యలు, సోషల్ మీడియా కట్టడిపై సమగ్ర విధానాల కోసం చర్చిస్తామని జేపీసీలో వెల్లడించామని టీడీపీ పార్లమెంటరీ ఎంపీ తెలిపారు.