అమరావతి : వైసీపీ కీలక నేత ఏపీ కూటమి ప్రభుత్వానికి ఘాట్‌గా హెచ్చరించారు. హత్యకేసులో గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపి నందిగాం సురేష్‌ను (Nandigam Suresh) వైసీపీ రాష్ట్ర కోఆర్టినేటర్సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy), మాజీ మంత్రి అంబటి రాంబాబు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం (Allaince Government) కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.
మాజీ ఎంపీ సురేష్‌పై ఆధారాలు లేకుండా కేసులు పెట్టి జైలులో ఉంచారని తెలిపారు. వైసీపీ హయాంలో చట్టం తన పని చేసుకుని వెళ్లిందని పేర్కొన్నారు. చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించి వైసీపీ నాయకులను అక్రమంగా జైల్లో పెడుతున్నారని విమర్శించారు. సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్‌ను ఎలా ఉంచాలనేది పోలీసు అధికారులకు ఆదేశిస్తున్నారని ఆరోపించారు.
గుంట నక్కల్లా వ్యవహరించడం వైసీపీకి తెలియదని, ముక్కుసూటి తనమే తమకు తెలుసని అన్నారు. నాలుగేళ్లలో తాము అధికారంలోకి వస్తే మా కార్యకర్తలు చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదని, మీ కంటే బలంగా పులి పంజలా కొట్టగలిగే శక్తి వైసీపీకి ఉందని స్పష్టం చేశారు. వేధించడం అంటే ఎలా ఉండాలో వైసీపీకి నేర్పుతుందని వ్యాఖ్యనించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ( TDP ) సిస్టమ్‌ను మేనేజ్ చేసుకుంటూ వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తరువాత మరింత మేనేజ్ చేసుకుంటున్నారని విమర్శించారు. అధికారం ఇచ్చింది ప్రజల శ్రేయస్సు కోసమని ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకోవడానికి కాదని అన్నారు. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు ఎల్లకాలం చెల్లవని సజ్జల పేర్కొన్నారు.