Kollu Ravindra | వెంకన్నపై విశ్వాసం లేకనే జగన్ తిరుమలకు వెళ్లలేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పర్యటన రద్దు చేసుకుని విమర్శలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. జగన్ తీరుతో హిందూ సంఘాలు ఆందోళనలో ఉన్నాయని అన్నారు. డిక్లరేషన్‌పై సంతకం పెట్టడానికి జగన్‌కు ఇబ్బందేంటి అని ప్రశ్నించారు. గతంలో అబ్దుల్ కలాం, సోనియా గాంధీ కూడా డిక్లరేషన్‌పై సంతకం పెట్టారని గుర్తుచేశారు. తాము ఏ ఒక్కరికీ నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
హింసా రాజకీయాలపై మాట్లాడే హక్కు పేర్ని నానికి లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గతంలో టీడీపీ, జనసేన నాయకుల ఇళ్లపై దాడికి దిగారని అన్నారు. తనపై హత్యాచారం కేసు మోపి 54 రోజులు జైల్లో పెట్టారని గుర్తుచేశారు. బందరు పోర్టు, మెడికల్ కాలేజీలను ఎవరికి బేరం పెట్టారని పేర్ని నానిని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల పేరుతో పేదల భూములు కబ్జా చేశారని ఆరోపించారు. పేర్ని నాని అవినీతిపై విచారణ జరుగుతోందని తెలిపారు. త్వరలోనే అన్ని వివరాలను బయటపెడతామని స్పష్టం చేశారు.