Pawan Kalyan : జనసేన పార్టీ అధ్యక్షుడు, నటుడు పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం నూకాలమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లిలోని నూకాలమ్మ తల్లి ఆలయానికి వెళ్లి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెంట పలువురు జనసేన నాయకులు ఉన్నారు.
#WATCH | Jana Sena Party chief Pawan Kalyan offered prayers at the Nookalamma temple in Anakapalli, Andhra Pradesh. pic.twitter.com/A07fd3efFO
— ANI (@ANI) June 10, 2024
కాగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ అద్భుత ఫలితాలు సాధించింది. ఎన్డీఏ కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్సభ స్థానాల్లో పోటీచేసిన జనసేన అన్ని స్థానాల్లో విజయాలు నమోదు చేసింది. ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.