(Vishaka Port) విశాఖ ఓడరేవు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. ఒక్క రోజులో అత్యధిక సరుకును హ్యాండిల్ చేసిన ఘనత సాధించింది. ఈ నెల 26వ తేదీన రికార్డు స్ధాయిలో కార్గోను హ్యాండ్లింగ్ చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఇన్నర్, ఔటర్ హార్బర్, ఎస్పీఎంల నుంచి 3,70,029 మెట్రిక్ టన్నుల సరుకును హ్యాండ్లింగ్ చేసి రికార్డు సృష్టించారు.
గతంలో ఒక్కరోజులో 3,47,722 మెట్రిక్ టన్నుల సరుకును హ్యాండిల్ చేసిన రికార్డును విశాఖ పోర్టు ప్రస్తుతం తిరగ రాసింది. ఈ అరుదైన రికార్డును సాధించడం పట్ల పోర్ట్ చైర్మన్ కే రామ్మోహనరావు హర్షం వ్యక్తం చేశారు. పోర్టు సిబ్బందిని అభినందించారు.
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..