అమరావతి : ఇటీవల ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ నౌకపై అమెరికా చేసిన మిసైల్ దాడిలో( US Missile Strike ) విశాఖ పట్నం శ్రీవారిపురానికి చెందిన సురేష్ పట్నాల ( Suresh Patnala ) మృతి చెందారు. ఈ దాడిలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. సురేష్ ప్రయాణిస్తున్న నౌక ప్రస్తుతం ఒమన్ తీరానికి 35 వాటికన్ మైళ్ల దూరంలో నిలిచిపోయింది. ఒమన్ అధికారులు రాత్రి నౌకను తీరానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. మృతదేహాన్ని త్వరగా స్వస్థలానికి రప్పించేలా ఎంబసీలతో మాట్లాడాలని సీఎం చంద్రబాబు ఏపీ భవన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వపరంగా సురేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని వెల్లడించారు. సురేష్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.