అమరావతి : వైసీపీ ఐదేళ్ల పాలనలో విశాఖను అడ్డగోలుగా దోచుకున్నారని ఎక్సైజ్‌శాఖమంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) ఆరోపించారు. కొండలను, గుట్టలను, గనులను దోచుకున్నారని, ప్రజల డబ్బులతో రిషికొండపై ప్యాలెస్ కట్టుకున్నారని దుయ్యబట్టారు. విశాఖలోని సింహాద్రి అప్పన్న ఆలయాన్ని(Simhadri Appanna temple) ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం అనంతరం అధికారులు శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న బాధలను పరిష్కరించేందుకు చంద్రబాబు(Chandra Babu), పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కూటమిగా ఏర్పడి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేశారని తెలిపారు. ప్రజలు కూటమికి స్పష్టమైన మెజారిటీ ఇచ్చి ఆశీర్వాదించారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు అన్ని వసతులు సమకూరుస్తామన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా జగన్ ప్రభుత్వం అడ్డుకుందని, పారిశ్రామికవేత్తలను బెదిరించారని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే అన్ని రకాల పెన్షన్లు పెంచి నేరుగా లబ్దిదారులకు అందజేసే కార్యక్రమాన్ని చేపడుతుందని పేర్కొన్నారు.