అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సందర్భంగా పలు ప్రజా, కార్మిక సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. దీంట్లో భాగంగా రేపు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం ప్రధాని విశాఖకు రానున్నారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ స్టీల్ పరిరక్షణ పోరాట సమితి నిరసనలకు పిలుపునిచ్చింది.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను నిలిపివేస్తూ తన పర్యటనలో మోదీ ప్రకటించాలని డిమాండ్ చేశాయి. శుక్రవారం విశాఖలోని కూర్మన్నపాలెం వద్ద కార్మిక, ఉద్యోగ సంఘాలు నిరసనను తెలిపాయి. సేవ్ వైజాగ్ స్టీల్.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు.