తిరుమల : దీపావళి (Deepavali) ఆస్థానం సందర్భంగా ఈనెల 31న తిరుమలలో (Tirumala) వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆలయానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు(Break Darsan) రద్దు చేశామన్నారు. ఈనెల 30న సిఫారసు లేఖలు స్వీకరించబోమని వెల్లడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
టోకెన్లు లేని భక్తులకు ఆరుగంటల్లో సర్వదర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకు నేరుగా ఆరు గంటల్లో దైవదర్శనం కలుగుతుందని వెల్లడించారు. నిన్న స్వామివారిని 77,844 మంది భక్తులు దర్శించుకోగా 27,418 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.27 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.