అమరావతిలో విలీనాన్ని వ్యతిరేకించిన గ్రామస్థులు..

అమరావతి : అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లో గ్రామాల విలీనాన్ని గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. గ్రామస్థుల అభిప్రాయాలను సేకరించడానికి వచ్చిన అధికారులకు గ్రామస్థుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు అధికారులు బుధవారం కురుగల్లు , నీరుకొండలో గ్రామ సభలను నిర్వహించారు. ఈ విలీనానికి వ్యతిరేకంగా ప్రజలు అభిప్రాయాలను వెల్లడించారు. విలీనానికి అనుకూలంగా, వ్యతిరేకంగా చేతులెత్తాలని కోరగా అధిక సంఖ్యలో వ్యతిరేకిస్తూ చేతులెత్తారు. దీంతో విలీనాన్ని గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నట్లు తీర్మాణం చేస్తున్నట్లు ఎంపీడీవో వెల్లడించారు.
గ్రామస్థులు మాట్లాడుతూ .. గతంలో ప్రజలతో చేసుకున్న సీఆర్డీ మాస్టర్ ప్లాన్ ఒప్పందం ప్రకారం 29 గ్రామాలను కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, అయితే 19 గ్రామాల్లో మాత్రమే అభిప్రాయాలను సేకరించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజలు, రైతుల మధ్య చిచ్చుపెట్టి విభజించాలని చూడడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

