Pawan Kalyan | జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌పై విజయవాడలోని కృష్ణలంకలో కేసు నమోదైంది. వారాహి విజయయాత్రలో భాగంగా ఏలూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయోధ్యనగర్కు చెందిన దిగమంటి సురేశ్ అనే వాలంటీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 405/2023 కింద ఫిర్యాదు స్వీకరించి జనసేనానిపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్‌పై ఐపీసీ సెక్షన్ 153, 153 (ఏ), 505(2) కింద కేసులు నమోదు చేశారు.
ఇటీవల ఏలూరులో రెండో విడత వారాహి యాత్రను ప్రారంభించిన సమయంలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఎంత మంది ఉన్నారు? వారిలో ఆడపిల్లలు ఎంతమంది? వింతవులు ఎంతమంది ఉన్నారు? వంటి వివరాలు సేకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి సెన్సేటివ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తోందని.. మహిళల భద్రతకు భంగం కలిగించేలా ఈ వ్యవస్థ ఉందని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఏపీలో పెద్ద దుమారమే లేపాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌పై వాలంటీర్ సురేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సెక్షన్ 153 – పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల కారణంగా రెండు వర్గాల మధ్య గొడవలు జరిగిన శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది
సెక్షన్ 153A – రెండు మతాలు, రెండు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం
సెక్షన్ 505(2) – తాను చెప్పేది అబద్ధమని తెలిసినప్పటికీ కావాలనే తప్పుదోవ పట్టించి గొడవలు సృష్టించే యత్నం