అమరావతి : కర్ణాటకలోని తుంగభద్ర (Tungabhadra dam) కు చెందిన ఒక గేటు కొట్టుకుపోవడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ప్రాజెక్టు దిగువభాగాన ఉన్న ఉమ్మడి కర్నూలు (Kurnool) జిల్లా ప్రజలను అప్రమత్తం చేశారు. తుంగభద్ర హోస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో 19వ గేట్ కొట్టుకుపోగా రాత్రి నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోతోంది.
మొత్తం 8 గేట్ల నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా దిగువకు విడుదల చేయడంతో ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని లోతట్టు ప్రాంతవాసులకు ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. గేట్ తెగిపోయిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandra Babu) వెంటనే ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని చంద్రబాబు సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల సంబంధిత జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి లోతట్టు ప్రాంతా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు తుంగభద్ర డ్యామ్ అధికారులతో మాట్లాడాలని మంత్రి పయ్యావుల కేశవ్‌కు సీఎం సూచించారు.
Home Minister Anitha | ఏపీ హోం మంత్రి అనితకు తప్పిన పెను ప్రమాదం
Good news | ఏపీలోని దేవాలయాలకు గుడ్‌న్యూస్.. దూపదీప నైవేద్యాలకు ఆర్థిక సాయం పెంపు : మంత్రి ఆనం