అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలకు(Temple) త్వరలో పాలకమండళ్లు (Governing bodies ) ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఆనం(Minister Anam) రాంనారాయణ రెడ్డి తెలిపారు. దూపదీప నైవేద్యాల కోసం రూ. 5 వేలకు బదులు రూ. 10 వేల ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు. దీని ద్వారా దేవదాయశాఖపై రూ. 32 కోట్ల అదనపు భారం పడుతుందని వెల్లడించారు.
రాష్ట్ర సచివాలయంలోని రెండో బ్లాక్లో ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సీజీఎఫ్ కింద 160 ఆలయాలు పునర్నిర్మిస్తామని అన్నారు. రాష్ట్రంలో 27, 127 ఆలయాల పరిధిలో 4.65 లక్షల ఎకరాలు ఉందని వివరించారు. ఆలయ భూములు పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తామని, కృష్ణా, గోదావరి సంగమం వద్ద జలహారతులు పునరుద్దరిస్తామని అన్నారు.
రూ. 50 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు ఆర్థికసాయం పెంచుతామని స్పష్టం చేశారు. దూపదీప నైవేద్యాల కోసం రూ. 5 వేలకు బదులు రూ. 10 వేల ఆర్థికసాయం అందజేస్తామన్నారు. దీని ద్వారా దేవదాయశాఖపై రూ. 32 కోట్ల అదనపు భారం పడుతుందని వెల్లడించారు.
తిరుమల (Tirumala) నుంచే దేవదాయ శాఖలో ప్రక్షాళన మొదలైందని పేర్కొన్నారు. ఆలయాల్లో ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకుంటున్నామని , అధికారుల పనితీరును మెరుగుపరుస్తున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో పనితీరు బాగులేని 5గురిపై చర్యలు తీసుకున్నామని అన్నారు.