అమరావతి: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. రేపు (సోమవారం) సాయంత్రం బెంగళూరు నుంచి గన్నవరం విమనాశ్రయానికి అక్కడి నుంచి ఆత్కూర్లోని స్వర్ణభారత్ ట్రస్టుకు చేరుకుంటారు. మార్చి 1న ఆత్కూరు నుంచి బయలు దేరి గుంటూరులోని లక్ష్మీపురంలో ఉన్న పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం గుంటూరులోని అన్నమయ్య గ్రంథాలయం, బృందావన్ గార్డెన్లను సందర్శిస్తారని సంబంధిత అధికారులు వెల్లడించారు. సాయంత్రం డాక్టర్ రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
రెండో తేదీన ఆత్కూర్లో పుస్తకావిష్కరణ, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సర్ సీఆర్ రెడ్డి కళాశాల విద్యాసంస్థలకు చేరుకుని ప్లాటినమ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారని వివరించారు. 3న ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలకు ఉపరాష్ట్రపతి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.