అమరావతి : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈనెల 19న విశాఖపట్టణానికి రానున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 19న ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ నగరానికి చేరుకుని పోర్టు అతిథిగృహంలో బస చేస్తారు. మరుసటి రోజు 20న ఇండియన్ సైక్రియాట్రిక్ సొసైటీ 73వ వార్షిక సదస్సులో, 21న ఇండియన్ ఇనిస్టి్ట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. 22న సాయంత్రం తిరిగి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో చేరుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.