అమరావతి : అత్యాచార బాధితుల (Victims) పేర్లను వెల్లడించిన వైసీపీ మాజీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్‌పై (Gorantla Madhav) ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ(Vasireddy Padma) పోలీసులకు ఫిర్యాదు చేశారు. చట్టంలోని నిబంధన ప్రకారం ఎవరూ కూడా బాధితుల పేర్లు, వారి నివాస ప్రాంతాలను వెల్లడించవద్దని వాటిని ఉల్లంఘించిన మాజీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని శనివారం విజయవాడ పోలీస్ కమిషనర్‌కు (Police Commissioner) ఫిర్యాదు చేశారు.
బాధితుల పట్ల బాధ, పశ్చాతాపం లేకుండా నిసిగ్గుగా బహిరంగంగా ప్రకటించడం సీరియస్ నేరమని అన్నారు. పోలీస్ కమిషనర్‌కు, సైబర్ క్రైంకు లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందించానని తెలిపారు. ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆమె త్వరలో ఏ రాజకీయ పార్టీలో చేరుతాననే విషయం వెల్లడిస్తానని తెలిపారు.