Varahi Vijaya Yatra | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర రెండో దశ షెడ్యూల్ ఖరారైంది. ఏలూరు నుంచి రెండో విడత యాత్ర ప్రారంభం కానుంది. రెండో విడత యాత్రకు సంబంధించిన ప్రణాళికపై పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో గురువారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం రెండో విడత విజయ యాత్ర షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఏలూరులో నిర్వహించే బహిరంగ సభతో వారాహి రెండో విజయ యాత్ర ప్రారంభం కానుంది. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులతో స్థానిక రాజకీయ పరిస్థితులపై పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు.
Varahi Vijaya Yatra