కుభీర్ : ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) సెర్ప్‌లో చాలీచాలని గౌరవ వేతనంతో పనిచేస్తున్న వీఏవోలు నిరవధిక సమ్మె ( VAOs Rally ) బాట పట్టారు. ఇందులో భాగం నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో ఆయా గ్రామాల వీఏఓలు మంగళవారం ఐకేపీ కార్యాలయం నుంచి ప్లకార్డులతో నిరసన తెలిపారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బస్టాండ్ మీదుగా తహసీల్ కార్యాలయం వరకు చేరుకుని తహసీల్దార్ శ్రీదేవికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వీఏవోల మండల అధ్యక్షులు జీవన్ మాట్లాడుతూ కనీస వేతనం, హెచ్ ఆర్ పాలసీ అమలు, పదోన్నతులు, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఏవోలు మంజుల, సాయినాథ్, భోజన్న, పడిగెటి రాజన్న, లతీఫ్, లంక సురేష్, ఆయా గ్రామాల వి ఏవోలు పాల్గొన్నారు.