మొంథా తుపాన్ నేపథ్యంలో ఏపీ మంత్రులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తుపాన్ నేపథ్యంలో సోషల్మీడియాలో వచ్చే తప్పుడు సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. సోషల్మీడియాలో సంయమనం పాటించాలని.. థంబ్నెయిల్స్తో ప్రజలను తప్పుదారి పట్టించవద్దని కోరారు. సంచలన హెడ్డింగ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని అన్నారు. తుపాన్ సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని తెలిపారు. తప్పుడు ప్రచారాలకు, గందరగోళానికి ఆస్కారం ఇవ్వవద్దని చెప్పారు.
ప్రభావిత ప్రాంతాల్లోని అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో జిల్లా ఇంచార్జి మంత్రి పి.నారాయణ, ప్రత్యేక అధికారి కృష్ణతేజ, కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ బిందుమాధవ్ పాల్గొన్నారు. జిల్లాలోని 12 మండలాలపై ప్రభావం ఉంటుందని అధికారులు వివరించారు.
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. ప్రాణ నష్టం సంభవించకుండా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాణ నష్టం సంభవించకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగులను గుర్తించి సురక్షిత ప్రదేశాలకు తరలించి వైద్య సేవలు అందించాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజల ఇళ్లకు భద్రత కల్పించాలని సూచించారు.
తుపాన్ నేపథ్యంలో సోషల్మీడియాలో వచ్చే తప్పుడు సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. సోషల్మీడియాలో సంయమనం పాటించాలని.. థంబ్నెయిల్స్తో ప్రజలను తప్పుదారి పట్టించవద్దని కోరారు. సంచలన హెడ్డింగ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని అన్నారు. తుపాన్ సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని తెలిపారు. తప్పుడు ప్రచారాలకు, గందరగోళానికి ఆస్కారం ఇవ్వవద్దని చెప్పారు.