అమరావతి : టీడీపీ (TDP) కార్యాలయంపై దాడి కేసు, కార్యాలయ సిబ్బంది కిడ్నాప్‌కేసులో రిమాండ్‌లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi ) విచారణ రెండో రోజు ముగిసింది. బుధవారం ఉదయం విజయవాడ (Vijayawada) జైలు వద్ద కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వంశీని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాదాపు 5 గంటల పాటు విచారించారు.
ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితులను ముగ్గురు ఏసీపీలు వేర్వేరుగా విచారించారు. ఈ సందర్భంగా సత్యవర్దన్ కిడ్నాప్, బెదిరింపుల వెనుక ఎవరున్నారని సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా ముగ్గురిని ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ తరువాత మరోసారి పరీక్షల నిమిత్తిం వంశీని జీజీహెచ్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలించారు.