అమరావతి : భారతజాతి గర్వించదగ్గ నేత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీ (Vajpayee)అని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. వాజ్పేయీ శత జయంతి సందర్భంగా వాజ్పేయీకి నివాళి అర్పించారు. దూరదృష్టి కారణంగా ప్రస్తుతం మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని , దేశం గురించి ఆయన ఆలోచించే తీరు విలక్షణమైందన్నారు. సంస్కరణల ప్రతిపాదనలపై ఆయన స్పందించిన తీరు ఎన్నటికీ మరచిపోలేదని అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో వాజ్పేయీ సమాధి వద్ద చంద్రబాబు నివాళి అర్పించారు.