Vaikuntha Ekadashi | డిసెంబర్ 20 నుంచి తిరుమలలో ‘ వైకుంఠ ఏకాదశి ’ ద్వార దర్శనాలు
Vaikuntha Ekadashi | డిసెంబర్ 20 నుంచి 29వ తేది వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వెల్లడించారు.
తిరుమల : డిసెంబర్ 20 నుంచి 29వ తేది వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ఏకాదశి ( Vaikuntha Ekadashi ) ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ( TTD ) అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ వెల్లడించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహం సుధర్మ సమావేశ మందిరంలో గురువారం వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు ప్రణాళికాబద్ధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికమంది సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు గత వైకుంఠ ద్వార దర్శనాల్లో చేసిన విధంగానే తొలి మూడు రోజులకు ఆన్ లైన్ లో ఈ-డిప్ ద్వారా ఎస్ఎస్డీ టోకెన్లు కేటాయించాలని చెప్పారు.
తర్వాతి ఏడు రోజులు సర్వ దర్శనం అమలు చేయాలని తెలిపారు. డిసెంబర్ 25వ తేది శుక్రవారం రోజున స్వామివారి అభిషేక సేవ సమయంలో కూడా సర్వ దర్శనం భక్తులకు దర్శనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీవీఎస్వో మురళీకృష్ణ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశికి పగడ్భందీ భద్రతా ఏర్పాట్లు చేపడతామని చెప్పారు. తిరుమలలో పార్కింగ్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చివరి ఏడు రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగిన విధంగా ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaikuntha Ekadashi | డిసెంబర్ 20 నుంచి తిరుమలలో ‘ వైకుంఠ ఏకాదశి ’ ద్వార దర్శనాలు
Gangula Kamalakar | కేసీఆర్ బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడితే.. రేవంత్ రెడ్డి చీకటి జీవో జారీ చేసిండు : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
‘మైనార్టీ మహిళలకు ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగ అవకాశాలు’
SI Krishna Reddy | తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టిని సారించాలి : ఎస్సై కృష్ణారెడ్డి
గౌతంపూర్ స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

