తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించు కుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. మంగళవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనానికి( Vaikuntha Dwara darshans ) భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. తొలిమూడు రోజులు ఈ-డిప్ ద్వార టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుందని టీటీడీ అధికారులు వెల్లడించిన కాని సాధారణ భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు.
టోకెన్ లేని భక్తులు జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 3,500 మంది పోలీసు, విజిలెన్స్ సిబ్బంది పగడ్భందీ ప్రణాళికలతో , ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తున్నారు. టోకెన్ కలిగిన భక్తులు నిర్దేశిత టైమ్ స్లాట్ ప్రకారం దర్శన క్యూలైన్లకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 59,631 మంది భక్తులు దర్శి్చుకోగా 18,609 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.36 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.