Vishaka Steel | విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ఆలోచనేదీ కేంద్రానికి లేదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఆయన ఆదివారం ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘విశాఖ స్టీల్ ప్లాంట్‌కు భవిష్యత్‌లో ఎటువంటి సమస్యలు రాకుండా కేంద్రం శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నదన్నారు. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు.
భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణం సత్తుపల్లి వరకూ పూర్తయిందని మంత్రి శ్రీనివాస శర్మ తెలిపారు. మిగతా పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. గత రెండు నెలలుగా పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.15 వేల కోట్లు విడుదల చేసిందని, అవసరమైన నిధుల విడుదలకు సిద్ధంగా ఉందన్నారు. సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయన్నారు.