Tirumala | తిరుమలను దర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
Tirumala | కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు.
తిరుమల : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్( Minister Piyush Goya ) శుక్రవారం తిరుమల ( Tirumala ) లోని శ్రీ వేంకటేశ్వరస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తిరుమలలో భక్తుల సేవల నిర్వహణలో కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) ద్వారా వసతి గదుల ఆక్యుపెన్సీ వివరాలు, భక్తుల రాకపోకలు, దర్శన క్యూ లైన్లు, లడ్డూ ప్రసాదాల పంపిణీ వంటి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వల్ల భక్తులకు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందుతున్నాయని చెప్పారు.

అంతకుముందు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ‘ ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటారు. తిరుమలలో తన తల్లి పేరుతో మొక్క నాటడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, తదితర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

