తిరుమల : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) శుక్రవారం తిరుమలలో ( Tirumala) స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన కేంద్ర మంత్రికి ఆలయ మర్యాదల ప్రకారం టీటీడీ ఈవో వెంకయ్య చౌదరి , తదితరులు స్వాగతం పలికారు. దర్శనం అనంరతం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్వీరచనం అందజేశారు. తీర్థ ప్రసాదాలతో పాటు శ్రీవారి ల్యామినేటెడ్ ఫోటోను ఆమెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్వో మురళీ కృష్ణ, డిప్యూటీ ఈవో లోకనాథం, తదితరులు పాల్గొన్నారు.