అమరావతి : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహాంరపై సుప్రీంకోర్టు సీబీఐ పర్యవేక్షణలో సిట్ వేయడంపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలను కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు(Rammohan Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తిరు పతి నుంచి ఢిల్లీకి ఇండిగో విమానాన్ని ప్రారంభించిన సందర్భంగా రేణిగుంట ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు.
సిట్ (SIT) లేదు గిట్ లేదంటూ జగన్ చులకన భావనతో మాట్లాడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ(Tirumala Laddu) ను అపవిత్రంపై సర్వత్రా విమర్షలు వస్తున్న సమయంలో సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై స్పందించిన కోర్టు సీబీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసిందని వెల్లడించారు.
ఏ అయితే సిట్ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయన్న భయం జగన్‌లో పట్టుకుందని విమర్శించారు. దేశంలో 75 విమానాశ్రయాలు ఉండగా నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక 156కు పెంచారని వివరించారు. పుట్టపర్తి, నెల్లూరు, ఒంగోలులలో స్థలాలను పరిశీలించి నూతన ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.