Paravada Pharma city | అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. ఎస్ఎస్ (సాయి శ్రేయాస్) ఫార్మాసిటీలో బుధవారం అర్థరాత్రి విషవాయువులు లీకై ఇద్దరు ఉద్యోగులు మరణించారు.
కంపెనీలోని ఎస్టీపీ దగ్గర లెవల్స్‌ను చెక్ చేయడానికి బుధవారం అర్ధరాత్రి ముగ్గురు కార్మికులు వెళ్లారు. ఆ సమయంలో విడుదలైన విషయవాయువులను పీల్చడంతో ఇద్దరు సేఫ్టీ ఆఫీసర్లు చంద్రశేఖర్, కుమార్ అస్వస్థతకు గురై మరణించారు. మరో కార్మికుడి పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం షీలానగర్‌లోని ఆస్పత్రికి తరలించారు.